Delhi: దీపావళికి ముందే ఢిల్లీలో GRAP-2 ఆంక్షలు అమలు..

ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్కడ వాయు నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఢిల్లీలో గవర్నమెంట్ GRAP-2 ఆంక్షలు అమలు చేసింది. దీపావళికి ముందే పరిస్థితి ఇలా ఉండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 

New Update
delhi

ఢిల్లీలో ఆదివారం కాలుష్య నిరోధక ప్యానెల్ అయిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పడిపోయిందని...ఇది మరింత దిగజారుతుందని అంచనా వేసింది. ఉదయం నుంచే ఎయిర్ ఇండెక్స్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయని..సాయంత్రం అయ్యేసరికి అది మరింత ఎక్కువ అవుతోందని  చెప్పింది. ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు 296, సాయంత్రం 7:00 గంటలకు 302 గా నమోదైందని తెలిపింది.అందుకే రాజధానిలో GRAP-2 కింద కాలుష్య నిరోధక ఆంక్షలు అమలు చేశామని చెప్పింది. 

దీపావళికి ముందే..


GRAP-2 ఆంక్షల్లో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో బొగ్గు, వంటచెరుకుతో పాటు డీజిల్ జనరేటర్ సెట్‌ల వాడకంపై పరిమితులు ఉంటాయి. దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించడానికి కొన్ని రోడ్లపై ప్రతిరోజూ ఊడ్చడం, నీరు చల్లడం చేస్తారు. ట్రాఫిక్‌ని కూడా బాగా కంట్రోల్ చేస్తారు. వీటితో పాటూ నిర్మాణ కార్యకలాపాలను నిషేధించడం, అన్ని ప్రాజెక్ట్ ప్రదేశాలలో తప్పనిసరిగా నీటిని చల్లడం, కాలుష్య కారక పరిశ్రమల తనిఖీలను పెంచడం, ప్రజా రవాణా కోసం CNG సమ్మతిని మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. దీపావళి తర్వాత గాలిలో నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే అందరూ తప్పనిసరిగా గ్రీన్ క్రాకర్స్‌నే కాల్చాలని..ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. 

Advertisment
తాజా కథనాలు