/rtv/media/media_files/2025/11/05/china-offers-to-help-india-2025-11-05-14-42-39.jpg)
China Offers To Help India to fight against Pollution
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అక్కడ గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. గాలి నాణ్యత సూచి (AQI) 400 దాటిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) గణాంకాలు తెలిపాయి. ఈ క్రమంలోనే చైనా.. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యాజింక్ ఎక్స్‌లో దీనికి సంబంధించి పోస్టు చేశారు.
Also Read: డబ్బులు కట్ అవకుండా విమానాల టికెట్ రద్దు ..డీజీసీఏ ప్రతిపాదన
'' చైనా కూడా గతంలో తీవ్రమైన పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యను ఎదుర్కోంటున్న వాళ్లతో మా ప్రయాణాన్ని పంచుకునేందుకు మేము రెడీగా ఉన్నాం. గాలి కాలుష్యం పరిస్థితి నుంచి భారత్ త్వరలోనే బయటపడుతుందని నమ్ముతున్నామని'' పేర్కొన్నారు. ఇదిలాఉండగా చైనాలో కూడా గతంలో పలు నగరాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంది. దీంతో చైనా.. గాలి నాణ్యత ప్రమాణాలను పాటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తోంది. భారత్ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలే తీసుకుంటే పరిస్థితులు మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అయిన న్యూయార్క్ కొత్త మేయర్
విద్యుదుత్పాదన, రవాణా రంగాలే కర్బన ఉద్గారాలకు, కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే చైనా ఎలక్ట్రిక్ వెహికిల్స్, పవన, సోలార్ ఎనర్జీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయంలో కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీలను కూడా తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటిని పట్టణాలు, నగరాల నుంచి దూరంగా తరలించి ఏర్పాటు చేసింది. దీనివల్ల అక్కడి పట్టణ, నగర ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలావరకు మెరుగుపడింది. చైనా లాగే భారత్ కూడా అన్ని ప్రమాణాలు పాటిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని నిపుణులు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.
Also Read: న్యూ యార్క్ లో చరిత్ర సృష్టించిన జోహ్రాన్.. మొదటి భారత సంతతి వ్యక్తి
Follow Us