Cloud Seeding: బోలెడు ఖర్చు పెట్టి ఢిల్లీలో మేఘమథనం..చుక్క కూడా పడని వాన

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేయించింది. దీని కోసం 3.21 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కాస్తా విఫలం అయి..ఒక్క కూడా వర్షం పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈరోజు కూడా ప్రయోగం చేయనున్నారు.

New Update
cloud seeding

Cloud Seeding: దేశ రాజధాని(Delhi) కొన్ని రోజులుగా వాయు కాలుష్యంలో(Air Pollution) కూరుకుపోయింది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత వరస్ట్ గా తయారయింది. దీని నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాన్ని తెప్పించడానికి పూనుకుంది. దీని కోసం 3.12 కోట్లు ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ చేయించింది. విమానాల ద్వారా సిల్వర్ అయోడైడ్ ను మేఘాల్లోకి చొప్పించింది. కానీ మొత్తం అంతా ఫెయిల్ అయింది. మేఘాల్లో సరైన తేమ లేకపోవడం వల్లన ఢిల్లీలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు.  మొత్తం మేఘ మథనం అంతా ఫెయిల్ అవ్వడమే కాక బోలెడంత డబ్బులు కూడా ఖర్చయ్యాయి.

Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం!

ఈరోజు మళ్ళీ ప్రయోగం.. 

అయితే దీన్ని ఇక్కడితో వదిలేయదల్చుకోలేదు. మరోసారి క్లౌడ్ సీడింగ్ చేస్తామని ఐఐటీ కాన్సూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. ఈరోజు మరోసారి ప్రయోగం జరగనుంది. దీంతో కచ్చితంగా వర్షం పుడుతుందని మణీంద్ర చెబుతున్నారు. వర్షం పడితే కాస్త అయినా కాలుష్యం తగ్గుతుందని చెబుతున్నారు. క్లౌడ్ సీడింగ్ కోసం ఉపయోగించిన మిశ్రమంలో 20% సిల్వర్ అయోడైడ్ మాత్రమే ఉందని, మిగిలినది రాతి ఉప్పు మరియు సాధారణ ఉప్పు కలయిక అని వివరిస్తూ, మంగళవారం 14 మంటలను పేల్చినట్లు అగర్వాల్ చెప్పారు. కనీసం తర్వాత ఎఫ్పుడో పడినా కూడా ఉపయోగం దక్కుతుందని చెప్పుకొచ్చారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని  పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' తుఫాన్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రైలర్..

కృత్రిమ వర్షం ఎలా పడుతుంది ?

మేఘాలలో కావాల్సినంత తేమ ఉంటుంది. కానీ వర్షం పడేందుకు అన్నివేళలా అనుకూల పరిస్థితులు ఉండవు. కృత్రిమ వర్షం కురిపించేందుకు ముందుగా శాస్త్రవేత్తలు అనువైన మేఘాలను గుర్తిస్తారు. వాటిపై పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయన ఉత్ర్పేరకాలను చల్లుతారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ అని అంటారు. ఇది మేఘాల్లో తేమను కరిగించి వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు పొడిమంచును కూడా వినియోగిస్తుంటారు. ఇక వర్షం కురిసినప్పుడు వాయు కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంది. 

ఆస్తమా, దగ్గులతో ఢిల్లీ వాసులు..

నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ వాసులు గొంతు నొప్పి, దగ్గు, కళ్ళు మంటతో బాధపడుతున్నారని లోకల్ సర్కిల్స్ నివేదిక చెబుతోంది. దీపావళిత తర్వాత ఢిల్లీ వాయు కాలుష్యం PM2.5 స్థాయిలను క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములుగా నమోదు అయింది. గత ఐదేళ్ళల్లో ఇదే అత్యంత ఎక్కువ స్థాయి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. పండుగకు ముందు 156.6 గా ఉండే ఇప్పుడు దాని కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉందని బోర్డు తెలిపింది.

Also Read: సైక్లోన్ 'మొంథా' ఎఫెక్ట్: ఆ రైళ్లు రద్దు.. ప్రయాణికులకు టోటల్ రిఫండ్..

అక్టోబర్ 20 రాత్రి మరియు అక్టోబర్ 21 తెల్లవారుజామున కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుందని PTI వార్తా సంస్థ  తెలిపింది.ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ ,ఘజియాబాద్ లలో 42శాతం ఇళ్ళల్లో ఎవరో ఒకరు అయినా గొంతునొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నారు. దాదాపు 25% కుటుంబ సభ్యులు కళ్ళు మంట, తలనొప్పి లేదా నిద్రలేమితో బాధపడుతున్నారని ..17% మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమా తీవ్రతరం అయిందని తెలుస్తోంది. దీంతో ఎయిర్ పొల్యషన్‌ నుంచి తప్పించుకునేందుకు 44శాతం మంది ఇళ్ళ నుంచి బయటకు రావడమే మానేశారు. 

Also Read: Pak Minister: భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మ.. మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ మంత్రి

Advertisment
తాజా కథనాలు