డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!
ఎయిర్ ఇండియా సేవలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రయాణికులను మోసం చేయడమేనని అభిప్రాయపడ్డారు.