/rtv/media/media_files/2025/06/13/PHXhG7zK8tqMIVqS1VCj.jpg)
air india express
Air India: వరుస వైఫల్యాలు, ప్రమాదాలతో విమర్శల పాలవుతున్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రూట్లలో సర్వీసులను కుదిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కాగా ఇప్పటికే ఇండియన్ ఎయిర్ లైన్స్ పలు సర్వీసులను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా తాజాగా కుదించనున్న సర్వీసులు దీనికి అదనం. ప్రస్తుతం మూడు రూట్లలో సర్వీసులను రద్దు చేయనుండగా, 19 దేశవాళీ రూట్లలో జూలై 15 వరకు సర్వీసులను కుదిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇరాన్‌పై అమెరికా దాడి నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలాన్ని ఆ దేశాలు మూసివేశాయి. ఈ కారణంగా ఆయా గగనతలాల్లో తమ విమానాలను ఆపరేట్ చేయడం లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
మరోవైపు జూన్ 21 నుంచి జూలై 15 వరకూ 38 అంతర్జాతీయ విమానాలను తగిస్తున్నట్లు తెలిపింది. మూడు ఓవర్సీస్ రూట్లలో ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని ఇటీవల ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక ఎయిర్ ఇండియా సస్పెండ్ చేసిన, కుదించిన సర్వీసుల్లో బెంగళూరు-సింగపూర్ (AI2392/2393) సర్వీసును సస్పెండ్ చేసింది. ముంబై-బెంగళూరు సర్వీసుల ఫ్రీక్వెన్సీని 91 నుంచి 84కి, ఢిల్లీ-బెంగళూరు సర్వీసులను116 నుంచి 113కి కుదించింది.బెంగళూరు--ఛండీగఢ్ సర్వీసుల ఫ్రీక్వెన్సీని 14 వీక్లీ సర్వీసుల నుంచి 7 వీక్లీ సర్వీసులకు తగ్గించింది. పుణే- -సింగపూర్ (AI2111/2110), ముంబై-బాగ్డోగ్రా (AI551/552) సర్వీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
ఎయిర్ ఇండియా నెట్‌వర్క్ విషయంలో వరుస వైఫల్యాలు, ప్రమాదల నేపథ్యంలో సంస్థను మరింత పటిష్టం చేయడానికి ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దానితో పాటు విస్తృత ఆపరేషన్ స్టెబిలిటీ, చివరి నిమిషంలో ప్రయాణికులకు అసౌకర్యంగా కలగకుండా నివారించేందుకు విమాన సర్వీసులను కుదించినట్టు వెల్లడించింది. సర్వీసులను తాత్కాలికంగా తగ్గించినప్పటికీ నారో-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా 120 డొమెస్టిక్, స్వల్ప దూర అంతర్జాతీయ రూట్లలో ప్రతిరోజూ సుమారు 600 విమానాలను నడపనున్నట్లు తెలిపింది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?