బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీలోగా చెల్లించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది.