అదానీ అవినీతి వెనక మోదీ హస్తం.. రాహుల్ గాంధీ సంచలనం!

అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ కుంభకోణం వెనక భారత ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. అదానీ అరెస్ట్ అయితే మోదీ కూడా లోపలికి వెళ్తారని చెప్పారు.

author-image
By srinivas
New Update
drre

Rahul gandi: అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారీ స్కాం చేసిన అదానీని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అదానీ వెనక ప్రధాని మోదీ ఉన్నారని, దొంగలకు మద్దతుగా నిలుస్తున్న మోదీ చిత్తశుద్ధి ఉంటే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్నారు. మోదీ, అదానీ ఎప్పటికీ ఒక్కటే అని, అదానీపై విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. 

అదానీని మోదీ కాపాడుతున్నారు..

 ఇది కూడా చదవండి: Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి!


అదానీ అమెరికా, భారత చట్టాలను ఉల్లంఘించారు. అయినా భారత్ లో స్వేచ్చగా తిరుగుతున్నారు. దేశంలో ముఖ్యమంత్రులను సైతం కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. కానీ అదానీని అరెస్ట్ చేయదు. అదానీని ప్రధాని కాపడుతున్నారు. మోడీ, అదానీ వేరు వేరు కాదు ఒక్కరే. రూ. 2 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ అదానీని బీజేపీ కాపాడుతుంది. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి. అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి. అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతా. అదానీ బీజేపీకి మద్దతుగా ఉంటారు. అందుకే అదానీని మోడీ ప్రభుత్వం కాపాడుతుంది. అదానీ తప్పు చేసారని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. కానీ భారత ప్రభుత్వం ఏమి చెయ్యడం లేదు. మోడీ, అదానీని ఏమి చేయలేదంటూ రాహుల్ మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి అరుదైన ఘనత!

ఇక అమెరికా FBI దర్యాప్తులో అదానీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపింది. అవినీతి ఎక్కడ జరిగినా దర్యాప్తు జరగాలి. అదానీ భారత్ ను హైజాక్ చేశారు. భారత్ అదానీ చేతిలో ఉంది. అదానీని మోడీ అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేస్తే మోదీ కూడా లోపలికి వెళ్తారు. ప్రధాని నిబద్ధత కోల్పోయారు. ఆదానీ, మోదీ ఒక్కరే అన్నది నిరూపిస్తాం. అదానీ.. మోదీ అవినీతిపరులు. అదానీ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మోదీ ఎలాంటి వారో దేశ ప్రజలకు చూపించాం. అదానీ వ్యవహారాన్ని వదలమని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

ఇది కూడా చదవండి: అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు