Adani: అమెరికాకు షాక్ ఇచ్చిన అదానీ.. 600 మిలియన్ల బాండ్ల రద్దు! హిండెన్‌బర్గ్ దాడుల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది. డాలర్ బాండ్ల ద్వారా 600M డాలర్లు సమకూర్చాలని భావించిన అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 21 Nov 2024 | నవీకరించబడింది పై 21 Nov 2024 11:52 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి America : హిండెన్‌బర్గ్ దాడుల నేపథ్యంలో గౌతం అదానీ గ్రూప్ అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని భావించిన అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అదానీ అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read : చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్ చేసి..! షేర్లపై పెను ప్రభావం.. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక హిండెన్‌బర్గ్ దాడుల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ మరో ప్రధాన ఆరోపణను ఎదుర్కొంది. ఈసారి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అమెరికా పెట్టుబడిదారులను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ కమిషన్ (SEC) ఆరోపించింది. ఈ కేసులో అదానీ మేనల్లుడు సాగర్ అదానీ.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. Also Read : HYDలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం ఆరోపణలు ఏమిటి.. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, జైన్‌లపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి.. అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని ఆరోపించింది. ఇతర ఐదుగురు నిందితులపై విదేశీ అవినీతి పద్ధతుల చట్టం కింద U.S. లంచాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారని, నలుగురిపై న్యాయాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు. నిందితులు ఎవరూ కస్టడీలో లేరని బ్రూక్లిన్‌లోని యుఎస్ అటార్నీ బ్రయోన్ పీస్ ప్రతినిధి తెలిపారు. ఇది కూడా చదవండి: HYDలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం దీనిలో భాగంగానే గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనళ్లుడు సాగర్ సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వీరు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు $265 మిలియన్ల లంచాలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీననంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి.. నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చలికాలంలో భోజనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి #america #dollar #adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి