Adani-Revanth: అదానీ, రేవంత్ రెడ్డి భేటీ రద్దు.. పొంగులేటి కారణంగానే?

ఈ రోజు జరగాల్సిన ఆదానీ, సీఎం రేవంత్ రెడ్డి భేటీ రద్దైంది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అదానీ భేటీ కావడం, మరో వైపు హర్యానా ఎన్నికల ప్రచారంలో అదానీ టార్గెట్ గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

New Update

సీఎం రేవంత్‌తో అదానీ భేటీ రద్దైంది. నిన్న రాత్రం పొంగులేటితో అదానీ స్నేహపూర్వకంగా భేటీ అయ్యారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ రద్దు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు హర్యానా ఎన్నికల ప్రచారంలో అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. దేశంలో అనేక సమస్యలకు అదానీ ఆస్థి కారణమంటూ ఉతికి ఆరేస్తున్నారు. ఈ సమయంలో అదానీని కలిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హైకమాండ్ భావించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి అదానీతో మీటింగ్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు

కేటీఆర్ ట్వీట్ తో ఉలిక్కిపడ్డ హైకమాండ్?

ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్‌ ఇవ్వడంతోపాటు, స్కిల్‌ యూనివర్శిటీ నిధుల కోసం అదానీ రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే.. నిన్న రాత్రి అదానీతో కోహినూర్‌ హోటల్‌లో పొంగులేటి భేటీ కావడం సంచలనంగా మారింది. అదానీతో నెం.2 కుట్ర చేస్తున్నాడని కేటీఆర్‌ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌తో కాంగ్రెస్ హైకమాండ్ ఉలిక్కిపడ్డట్లు తెలుస్తోంది. 

హర్యానాలో అదానీని తిట్టి తెలంగాణలో కలవడం ఎన్నికల్లో నష్టం చేస్తుందని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గందరగోళం కారణంగా రేవంత్‌ను కలవకుండానే అదానీ వెనుదిరిగారని తెలుస్తోంది. హర్యానా ఎన్నిక తర్వాత ఢిల్లీలో రేవంత్‌కు వరద సహాయం చెక్‌ ఇవ్వాలని అదాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు