బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీలోగా చెల్లించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది. By B Aravind 03 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. అయితే ఈ నెల ఏడో తేదీలోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం అదానీ పవర్ సంస్థకు బంగ్లాదేశ్ ప్రభుత్వం రూ.7,200 కోట్ల బకాయిలు ఉంది. అయితే ఈ బకాయి చెల్లింపుల విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆధీనంలో బంగ్లాదేశ్‌కు పవర్ డెవలప్‌మెంట్ బోర్డుకు.. అదానీ పవర్‌కు మధ్య ఏమైనా సెటిల్మెంట్ జరిగిందా ? అనే విషయంపై స్పష్టత లేదు. Also Read: జమిలీ ఎన్నికలపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన బకాయిలు చెల్లించకపోవడం వల్ల సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్ కోసం సుమారు రూ.1500 కోట్ల (170 మిలియన్ డాలర్లు)కు అక్టోబర్ 31 లోగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేయాలని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డుకు అదాని పవర్ డెడ్‌లైన్ పెట్టింది. కృషి బ్యాంకు నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంది. అయితే ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌లో భాగం కాదని బీపీడీబీ వర్గాలు పేర్కొన్నాయి. డాలర్ల కొరత వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడానికి మరో కారణం కూడా ఉంది. దీని ఫలితంగా అక్టోబర్ 31 నుంచి జార్ఖండ్‌లో గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1496 మెగావాట్ల విద్యుత్‌కు బదులు 724 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసింది. Also Read: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలతో పాటు రాజకీయ సంక్షోభంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. గత నెలలో చూసుకుంటే 90 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లల బకాయిలను బీపీడీబీ అదానీ పవర్‌కు అందించినట్లు తెలుస్తోంది. అలాగే నెలవారీగా 90-100 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లులకు కేవలం 20 నుంచి 50 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బకాయిలు పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అదానీ పవర్ తయారు చేసే విద్యుత్ మీద కూడా యూనిట్‌కు రూ.10-12 పడుతోంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గుతో తయారుచేస్తున్న విద్యుత్ ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. #telugu-news #national-news #adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి