Tirupati: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ.. 20 మందికి పైగా!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఒక డ్రైవర్ తోపాటు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.