/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Alluri District Road Accident
తిరుపతి-చెన్నై హైవేపై చిత్తూరు దగ్గరలో కొద్ది సేపటి క్రితం పెద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు పార్ట్ అంతా నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి..మృతుల వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Kolkata: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య