Ireland: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐర్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఒకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) కాగా.. మరొకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్‌ (25)గా గుర్తించారు.

New Update
bhupala palli  crime

 Child died in Lorry Accident

ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఒకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) కాగా.. మరొకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్‌ (25)గా గుర్తించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భార్గవ్, సురేశ్ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికెళ్లారు. అయితే దారిలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో ఈ ప్రమాదంలో భార్గవ్, సురేశ్ దుర్మరణం చెందారు.

Also Read: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

 ఇదిలాఉండగా ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్‌ ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం యూఎస్‌ వెళ్లాడు. పేద కుటుంబానికి చెందిన వాజిత్‌ పార్ట్ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూనే తన చదువు కొనసాగించాడు.   భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి చెందాడు. 

Also Read: వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్

ఈ మధ్యకాలంలో అమెరికాతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఉన్నత చదువుల కోసం పిల్లల్ని విదేశాలకు పంపించడంపై తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. మరికొందరు విద్యార్థులు దుండగుల కాల్పుల్లో కూడా చనిపోతున్న ఘటనలు జరుగడం ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ దీవులకు కేంద్రం గుడ్‌న్యూస్

Advertisment
తాజా కథనాలు