Ap: ఐర్లాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి

ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్‌ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ గా అధికారులు గుర్తించారు.

New Update
 Road Accident wanaparthy

Road Accident

ఐర్లాండ్‌ లో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. చనిపోయిన వారిని జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్‌ (24), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ (25)లుగా అధికారులు గుర్తించారు. 

Also Read: Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా..ఉత్సాహంగా గడుపుతారు..!

జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి సాయిబాబా జగ్గయ్యపేటలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ ప్యూరిఫైడ్‌ వాటర్‌ పరికరాల బిజినెస్ చేస్తుంటారు. సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. కార్లోలోని సౌత్‌ఈస్ట్ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. భార్గవ్ అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు. చెరుకూరి రామకోటయ్య, కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్‌ ఎమ్మెస్‌ చేసేందుకు ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు.

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

భారీగా మంచు కురవడంతో...

ఈ క్రమంలో చిట్టూరి భార్గవ్, చెరుకూరి సురేష్‌లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో కారు చెట్టును ఢీకొట్టడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. ఈ ఘటనలో భార్గవ్, సురేష్‌లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉన్నత చదువు కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ రోడ్డు ప్రమాదంపై భార్గవ్ తండ్రి సాయిబాబాకు అక్కడ యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చింది. భారీగా మంచు కురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.సాయిబాబా కుమారుడ్ని ఉన్నత విద్య చదివించాలని ఐర్లాండ్‌ పంపించారు. భార్గవ్ చదువు కొద్ది నెలల్లో పూర్తికానుండటంతో.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే భార్గవ్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటున్నారు. 

ఈ ప్రమాదం గురించి తెలియగానే భార్గవ్‌ బంధువులు టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను కలిశారు. ఐర్లాండ్‌ నుంచి భార్గవ్ భౌతికకాయాన్ని తెప్పించాలని కోరగా.. నెట్టెం రఘురాం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు వెంటనే స్పందించి ఐర్లాండ్‌లో భారత రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐర్లాండ్‌లో పూర్తి చేయాల్సిన లాంఛనాలు త్వరగా పూర్తిచేసి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Also Read: Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు