Haryana: హరియాణాలో కాలువలోకి దూసుకెళ్ళిన జీపు..9 మంది మృతి

హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

New Update
accident

అంతా బాగా జరిగింది. అందరూ ఆనందంగా పెళ్ళి వేడుకలో పాల్గొన్నారు. కానీ తిరిగి వస్తుండగా తీరని విషాదం చోటు చేసుకుంది. హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో పెద్ద ప్రమాదం సంభవించింది పెళ్ళి వేడుక నుంచి వస్తున్న జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా..మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సర్దారెవాలా గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. వివాహ వేడుక నుంచి 13 మందితో తిరుగు ప్రయాణం చేస్తున్న క్రూజర్‌ భాఖడా కాలువలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ అర్ధరాత్రి చీకటి కావడం వలన సహాయ కార్యక్రమాలు కష్టతరం అయ్యాయి. అప్పటికీ ఇద్దరిని రక్షించగలిగారు. మృతుల్లో ఐదుమంది మహిళలు, 11 ఏళ్ల చిన్నారి ఉన్నారు. 

Also Read: Guntur: కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు

Also Read: GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు