/rtv/media/media_files/2025/02/05/zCapCMa2yT3x0PPZ0vw6.jpg)
Ex Indian Cricketer Rahul Dravid
ఆటో డ్రైవర్ తో మాజీ ఇండియన్ ప్లేయర్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ కారు దిగి మరీ గొడవ పడ్డారు. తన కారును ఆటో ఢీ కొట్టడంతో ఆయన ఫైర్ అయ్యారు. టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కారు బెంగళూరులో ప్రమాదానికి గురైంది. బిజీగా ఉన్న రోడ్డులో ఆయన కారును ఒక ఆటో గుద్దింది. అయితే ఈ ఘటనలో రాహుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025
రాహుల్ వీడియో వైరల్..
ప్రమాదం తర్వాత ద్రవిడ్ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. దీనిని ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడు ఇది కాస్తా వైరల్ గా మారింది. అయితే ప్రమాదం జరగడానికి ఎవరు కారణం అన్నది మాత్రం తెలియలేదు. ద్రావిడ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడా...లేక ఆటో అతనా అన్న డీటెయిల్స్ లేవు. చిన్న ప్రమాదమే కావడంతో దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా చేయలేదు. అయితే ద్రావిడ్ కు ఏమీ కాకపోవడంతో అతని ఫ్యాన్స్ మాత్రం పోనీలే అని ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
టీమిండియా జట్టు తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడి దవాల్ గా పేరుతెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్… కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. కెరీర్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత అండర్ 19 టీమ్ కు, తరువాత టీమిండియా మెయిన్ జట్టుకు కూడా కోచ్ గా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడే టీమ్ ఇండియా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వరకూ వెళ్ళింది.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్