Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. తానే యుద్ధం ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భవిష్యత్‌లో మళ్లీ యుద్ధం చేయొద్దని ఇరు దేశాధినేతలకు సూచించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. పర్మినెంట్ సీజ్ ఫైర్ చేయాలని సూచించానన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2025 మొదటి త్రై మానసికంలో 0.3 శాతం క్షీణత నమోదైంది. దీనికి కారణం ట్రంప్ విధించిన సుంకాలే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం అంతా బైడెన్ విధానాల వల్లనే అంటున్నారు.
తన వైఖరిపై నిరసన తెలిపిన హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మండిపడ్డాడు. విశ్వవిద్యాలయానికి నిధులు ఆపేసి.. ట్యాక్స్ వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. హర్వర్డ్ పనికి మాలిన రాజకీయ సంస్థ అని యూనిర్సిటీపై జోకులు వేశాడు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా సీరియస్ అయ్యారు.
ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది.
టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.
కెనాడా ప్రధాని జస్టిస్ ట్రూడో మీడియా ముందే ఏడ్చేశారు. ప్రధానిగా ఆయన పదవి మరో 3రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో కెనడా దేశ పరిస్థితులు, అమెరికా ఆ దేశంపై అవలంభిస్తున్న విధానాలు తలుచుకోని జస్టిస్ ట్రూడో భావోద్వేగానికి గురైయ్యాడు.
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13ఏళ్ల బాలుడి కలను ట్రంప్ నిజం చేశారు. డీజే డేనియల్ మరో 5 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు తెలిపారు. దీంతో డీజే డేనియల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించాడు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. పలు విషయాల్లో అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించారు. మోదీ కూర్చుంటున్నప్పుడు స్వయంగా ట్రంపే కుర్చీ వేశారు. మళ్లీ లేస్తుండగా కుర్చీ వెనక్కి తీశారు. మోదీపై ఆయనకున్న గౌరవాన్ని ఇలా చూపించారు.