Justice Trudeau : మీడియా ముందే బోరున ఏడ్చేసిన జస్టిస్ ట్రూడో

కెనాడా ప్రధాని జస్టిస్ ట్రూడో మీడియా ముందే ఏడ్చేశారు. ప్రధానిగా ఆయన పదవి మరో 3రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో కెనడా దేశ పరిస్థితులు, అమెరికా ఆ దేశంపై అవలంభిస్తున్న విధానాలు తలుచుకోని జస్టిస్ ట్రూడో భావోద్వేగానికి గురైయ్యాడు.

New Update
Trudeau

Trudeau Photograph: (Trudeau )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో పదవి కాలం మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ట్రూడో ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందు ఏడ్చుకుంటూ.. కెనడియన్ పౌరులకు ఐక్యంగా ఉండాలని ప్రజలకు ట్రూడో విజ్ఞప్తి చేశారు. కెనడా దేశ పరిస్థితులు, అమెరికా ఆ దేశంపై అవలంభిస్తున్న విధానాలు తలుచుకోని జస్టిస్ ట్రూడో భావోద్వేగానికి గురైయ్యాడు.

ట్రంప్ సుంకాల కారణంగా కెనడాలో రాబోయే కాలం మరింత కష్టతరంగా మారుతుందని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ గురువారం కెనడియన్ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. 

Also read: Tahawwur Rana: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ప్రధానమంత్రిగా తాను ప్రతిరోజూ కెనడా పౌరుల మంచికే మొదటి ప్రాధాన్యత ఇచ్చానని ట్రూడో అన్నారు. కెనడా ప్రజలను ఆయన శ్రద్ధగా చూసుకున్నానని చెప్పారు. ఆయన పదవిలో ఉన్న చివరి రోజుల్లో కూడా కెనడా ప్రజల బాగోగుల గురించే ఆలోచించానని కంటతడి పెట్టుకుంటూ అన్నారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా ఆయన కెనడా ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకుంటానని వివరించారు.

Also read: Israel Rescues Indians: పాలస్తీనాలో చిక్కుకున్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయిల్

కెనడా ప్రజలు, పాలకుల మధ్య గెలుపోటములు ట్రంప్‌కు విజయాన్ని మాత్రమే తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ వ్యాపారంలో కెనడా మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష్య పెంచుకున్నారని ఆయన అన్నారు. మార్చి 9తో జస్టిస్ ట్రూడో ప్రధాని పదవి బాధ్యతలు ముగియనున్నాయి. అదే రోజున అధికార లిబరల్ పార్టీ తన కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు