USA: కుప్పకూలిన అమెరికా..దారుణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థ

అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2025 మొదటి త్రై మానసికంలో 0.3 శాతం క్షీణత నమోదైంది. దీనికి కారణం ట్రంప్ విధించిన సుంకాలే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం అంతా బైడెన్ విధానాల వల్లనే అంటున్నారు. 

New Update
Trump

Trump

అమెరికా ఫస్ట్..అనేది దేశం కొంపకూలుస్తోందని అంటున్నారు అక్కడి ఆర్తి నిపుణులు, ప్రతిపక్షాలు, పౌరులు. దీని వలన అమెరికాలో విపరీతమైన ధరలు పెరిగిపోవడమే కాక...ఆర్థికంగా కుదేలయ్యేలా చేసిందని చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించడానికి కారణమిదే అని ఆరోపిస్తున్నారు. ట్రంప్ వంద రోజుల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, సుంకాల విధింపు లాంటివి మిగతా దేశాల మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందో తెలియదు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థను మాత్రం కిందకు తోసేస్తుందని నిపుణులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. US వాణిజ్య విభాగం లెక్కల ప్రకారం..స్థూల దేశీయోత్పత్తి (GDP), మొదటి త్రైమాసికంలో వార్షికంగా 0.3% రేటుతో క్షీణించింది. యూఎస్ ఫ్యూచర్ స్టాక్స్ పడిపోయాయి.  అలాగే డౌ జోన్స్ 0.7 శాతం, ఎస్ అండి పీ 1.2శాతం, నాస్డాక్ 1.7 శాతం పడిపోయాయి.

బైడెన్ విధానాలే కారణం...

అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అవడానికి కారణం బైడెన్ విధానాలే అని ఆరోపిస్తున్నారు. తనను తాను సమర్ధించుకుంటూ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. విస్తృత సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు వెంటనే కనిపించకపోయినా సమీప భవిష్యత్తులో అద్భుత పరిణామాలను చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత క్షీణత తన నిర్ణయాల వలన వచ్చింది కాదని...అది బైడెన్ స్టాక్ మార్కెట్ రిజల్ట్ అని చెబుతున్నారు. తాను జనవరి 20 వరకు బాధ్యతలు స్వీకరించలేదని ట్రంప్ అంటున్నారు. బైడెన్ ఓవర్ హ్యాంగ్ నుంచి బయటపడాలి. సుంకాలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. మన దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది అని ట్రంప్ రాశారు. దీని కోసం కాస్త వెయిట్ చేయాలని అన్నారు. బూమ్ ప్రారంభం అవ్వడం మొదలయ్యాక...ఎప్పుడూ చూడని అభివృద్ధిని చూస్తారని అన్నారు. 

 

today-latest-news-in-telugu | usa | 47th us president donald trump | joe-biden

Also Read: దొంగ కాదు గజదొంగ.. కళ్లలో కారం కొట్టి డబ్బులతో పరార్ - వీడియో చూశారా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు