Modi in America: బాస్‌లకే బాస్.. మోదీ కూర్చున్న కుర్చీని జరిపిన ట్రంప్

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. పలు విషయాల్లో అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించారు. మోదీ కూర్చుంటున్నప్పుడు స్వయంగా ట్రంపే కుర్చీ వేశారు. మళ్లీ లేస్తుండగా కుర్చీ వెనక్కి తీశారు. మోదీపై ఆయనకున్న గౌరవాన్ని ఇలా చూపించారు.

New Update
modi in america

modi in america Photograph: (modi in america)

Modi in America: మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌(Donald Trump)ను కలిశారు. వైట్‌వైస్‌(White House)లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. వెస్ట్ వింగ్ లాబీ(West Wing Lobby)లో ఇద్దరు నాయకులు హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. మోదీ కూర్చుంటున్న చైర్‌ను స్వయంగా ట్రంపే వెనక్కి లాగారు. మోదీ కుర్చొని లేచేటప్పుడు మళ్లీ కుర్చీ వెనక్కి జరిగి మోదీ పట్ల ఆయనకున్న వ్యక్తిగత గౌరవాన్ని ప్రదర్శించారు. ట్రంప్ ఎవరికైనా ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం చాలా అరుదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రంప్‌కు భారత్ అన్నా, మోదీ అన్నా ఎంత గౌరవమో అని.

ఇది కూడా చదవండి: AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన!

ఇది కూడా చదవండి:  లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!

ట్రంప్ రెండవ సారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక మోదీ మొదటి పర్యటన ఇదే. 2017లో నాలుగేళ్లు అధ్యక్షుడిగా పని చేసినప్పుడు కూడా మోదీ, ట్రంప్ మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉండేది. అదే టైంలో అమెరికా, భారత్ దౌత్యసంబంధాలు చాలా బలపడ్డాయి. ఆయన విజయంపై కూడా మోదీ ట్రంప్‌కు శుభాకంక్షలు చెప్పారు. 

ఇది కూడా చదవండి: మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?

సమావేశానికి ముందు..

 ప్రధాని మోదీ అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులతో చర్చలు జరిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk), భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Rama Swamy), అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌ లను మోదీ కలిశారు. తర్వత అమెరికా నుంచి నేరుగా ఇండియా బయలుదేరనున్నారు.

Also Read: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు