/rtv/media/media_files/2025/04/16/u9TTgLqZ4r1APxEYCjwh.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తన వింత నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్నాడు. రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ఛేష్ఠలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఫస్ట్ వలవవాదులపై ఉక్కువాదం, తర్వాత ప్రపంచ దేశాలపై టారీఫ్ లు పెంచాడు. ఐక్యరాజ్య సమితికి, విదేశీ సాయం నిధులు తగ్గించాడు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ మీద పడ్డాడు. ట్రంప్ విదేశీ విద్యార్థులు, వలసవాదులపై అవలంభించిన తీరుపై హార్వర్డ్ వర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు. అదే సమయంలో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ట్రంప్ మండిపోయింది. ఆ యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వం అందించే ఫెడరల్ నిధులను నిలివేస్తామని హెచ్చరించాడు. అది యూనివర్సిటీ కాదు ఓ పనికిమాలిన రాజకీయ సంస్థ హార్వర్డ్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.
Also read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేదించిన కేంద్రం
🚨 NEW: President Trump calls Harvard University a ‘joke’ and says that it can ‘no longer be considered even a decent place of learning’ pic.twitter.com/fqGoQZIrfo
— Politics US (@PolitlcsUS) April 16, 2025
రాజకీయ సిద్ధాంతపరమైన ఉగ్రవాద ప్రేరేపిత వైఖరి మానుకోవాలని హార్వర్డ్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. క్యాంపస్ లో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే ఆందోళన ఆలోచన పక్కన పెట్టాలని యూనివర్సిటీకి చురకలు అంటించారు. వర్సిటీకి పన్ను మినహాయింపు హోదా రద్దుచేస్తామని బెదిరించాడు. తమ స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగ హక్కులను సవాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హార్బర్డ్ చీఫ్ అలన్ గార్బర్ అన్నారు. ట్రంప్ మాటలను ఆయన ఖండించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలో హార్వర్డ్ ఒకటి అని వర్సిటీ చీఫ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హార్వర్డ్ సంస్థ, ట్రంప్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు