BIG BREAKING: యుద్ధంపై భారత్, పాక్‌కు నేనిచ్చిన వార్నింగ్ ఇదే.. ట్రంప్ సంచలనం!

ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తానే యుద్ధం ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భవిష్యత్‌లో మళ్లీ యుద్ధం చేయొద్దని ఇరు దేశాధినేతలకు సూచించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. పర్మినెంట్ సీజ్ ఫైర్ చేయాలని సూచించానన్నారు.

New Update
Donald Trump

Donald Trump

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దానికి కొన్ని నిమిషాల ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తానే యుద్ధం ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 

భవిష్యత్‌లో మళ్లీ యుద్ధం చేయొద్దని ఇరు దేశాధినేతలకు సూచించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. పర్మినెంట్ సీజ్ ఫైర్ చేయాలని సూచించానన్నారు. నా మాటను ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. నాకు చాలా గర్వంగా ఉందని ట్రంప్ మీడియా ముందు అన్నారు. ఈ యుద్ధం ఆపడానికి చాలా ట్రై చేశానన్నారు ట్రంప్. మీతో వ్యాపారం చేయాలంటే యుద్ధం ఆపాలని ఇరు దేశాలకు షరతులు పెట్టానని ట్రంప్ అన్నారు. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా కలుగజేసుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేయించిన విషయం తెలిసిందే.

(Pakistan india War | 47th us president donald trump | america president donald trump | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు