TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.

New Update
trump tax backstep

trump tax backstep

TRUMP Tariffs: ప్రపంచవ్యాప్తంగా అమెరికా టారీఫ్‌లతో ట్రేడ్ వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. 180 దేశాలపై విధించిన దిగుమతి సుంకాలు ఏప్రిల్ 2నుంచి అమలు లోకి వచ్చాయి. ఈ సుంకాల విషయంలో ఇప్పటికే పలు దేశాలతోపాటు సొంత దేశం అమోరికా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు అగ్రరాజ్య అధిపతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైట్‌హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పలు దేశాలపై టారీఫ్‌లను ఎత్తివేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తున్నారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

Also read: Software employee suicide: కాకినాడలో మరో బెట్టింగ్ బాధితుడు బలి.. తల, మొండెం వేరై

ఆయా దేశాలపై 90 రోజుల పాటు టారీఫ్‌లు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చైనా మినహా మిగతా దేశాలపై టారీఫ్‌లు నిలిపివేసే ఛాన్స్ ఉందని చర్చ కొనసాగుతుంది. ఈ విషయంలో ఆర్థిక మండలి సలహాతో ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోనూ ఆందోళనలు వ్యక్తమతున్నాయి. టారీఫ్ పెంపుతో అమెరికా ప్రజలపైనే అధిక ధరల భారం పడే అవకావం ఉందని, దేశ ప్రజల కొనుగోలు శక్తి తగ్గి అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో అమెరికాలో నిరసనలకు కూడా దిగారు. అమెరికా దేశ ప్రజలు, పన్నులు విధించిన దేశాధిపతుల నుంచి పెద్ద మొత్తంలో వ్యతిరేకత రావడంతో ట్రంప్ టారీఫ్‌ గురించి మరోమారు ఆలోచిస్తున్నారు.

Also read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు