Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు.