/rtv/media/media_files/2025/07/28/supreme-court-2025-07-28-17-50-05.jpg)
Supreme Court stray dog
Supreme Court : వీధికుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు... ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల భద్రత, పరిశుభ్రతను నిర్ధారించడానికి స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను సంబంధిత డాగ్ షెల్టర్లకు చేర్చాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాలలో స్పష్టం చేసింది.
వీధికుక్కల సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు మూడు ఆదేశాలు ఇచ్చింది. అమికస్ క్యూరీ నివేదికపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. మరో ఉత్తర్వులో, వీధికుక్కల విషయంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతే కాక వీధికుక్కలను రహదారులు, రోడ్ల వెంబడి వదిలేయకుండా వాటిని తొలగించి షెల్టర్లలో ఉంచాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్లు ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలపై 24 గంటలు నిఘా ఉంచాలని పేర్కొంది. అంతేకాకుండా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ జారీ చేయాలని కూడా కోర్టును ఆదేశించింది.
ముఖ్యంగా విద్యాసంస్థలు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు ప్రవేశించకుండా కంచెలు ఏర్పాటు చేయడంతోపాటు ఇతర చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని షెల్టర్లలో ఉంచాలని కోర్టు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 11న, జస్టిస్ జె.బి. పార్దివాలా, ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం కుక్క కాటులను సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో ఉన్న అన్ని వీధి కుక్కలను షెల్టర్ హోమ్ లకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జంతు ప్రేమికులు ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేశారు.
కాగా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేసింది. అనంతరం ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కలను పట్టుకొని వాటిని క్రిమిరహితం చేయడానికి టీకాలు వేయడం, వాటిని తిరిగి వాటి ఆవాసాలలోకి విడుదల చేయాలని ఆదేశించింది. ఆగస్టు 22న, కోర్టు విచారణల పరిధిని మరింత విస్తరించింది. వివిధ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటిని తనకే బదిలీ చేయించుకుంది. రాష్ట్రాలను అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. అయితే, ఈ విషయంలో రెండు రాష్ట్రాలు మాత్రమే స్పందించి రెండు నెలల్లో అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు తప్ప మరెవరూ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం పట్ల న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం పట్ల కూడా ప్రశ్నించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మాత్రమే ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
అక్టోబర్ 27న జరిగిన విచారణ సందర్భంగా, దేశవ్యాప్తంగా కుక్కలకు సంబంధించిన సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. కుక్కకాటుతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడం తప్పు. రాష్ట్రాలు తమ ప్రతిస్పందనలను దాఖలు చేయడంలో విఫలమైనందుకు అసంతృప్తి వ్యక్తం చేసింది. “రాష్ట్ర అధికారులు వార్తాపత్రికలు చదవరా లేదా సోషల్ మీడియాను ఉపయోగించరా?” అని ప్రశ్నించింది. ఆర్డర్ కాపీ వారి డెస్క్‌లకు చేరకపోయినా, వారికి ఈ ముఖ్యమైన విషయం గురించి తెలిసి ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఈ విషయంలో 8 వారాల గడువు ఇచ్చింది.
Follow Us