Maoist Party: ఆయుధాలు వదిలేస్తాం.. మావోయిస్టుల సంచలన ప్రకటన!

మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయుధాలను వదిలేసి..ప్రజా పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించింది. పార్టీ అధికార ప్రతినిధి ‘అభయ్’ పేరుతో ప్రకటన విడుదల చేశారు.

New Update
Sensational statement by Maoists!

Sensational statement by Maoists!

Maoist Party: వరుస వైఫల్యాలు, అగ్రనేతల ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆయుధాలను వదిలేసి.. ప్రజా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి ‘అభయ్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాక అభయ్‌ పేరుతో పార్టీ కార్యకలపాలు నిర్వహిస్తున్న పార్టీ అగ్రనేత కిషన్‌ జీ సోదరుడు  మల్లోజుల వేణుగోపాల్‌ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడం విశేషం. మరో వైపు మావోయిస్టు నిర్ణయంపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వీలుగా  ఓ ఈ-మెయిల్, ఫేస్‌బుక్‌ ఐడీలను కూడా  మావోయిస్టుపార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్‌ (nampet(2025) @gmail.com), ఫేస్‌బుక్‌ (nampetalk) ఐడీలను అందుబాటులోకి తెస్తామని అభయ్‌ ప్రకటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ ప్రకటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల ఈ నిర్ణయం దేశంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు. దీనితో ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మావోయిస్టులను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే  నిఘావర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి.

ఇంతకీ ప్రకటనలో ఏముందంటే....


మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఆగస్టు 15న విడుదలయిన ఈ ప్రకటన నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది.  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి మరియు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా శాంతి చర్చలకు ఆసక్తి చూపిన  పాలక, ప్రతిపక్ష పార్టీలు, శాంతికమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ‘ఈఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో శాంతిచర్చలకు నిజాయతీగా ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరుతో ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. శాంతి చర్చలకు అనుగుణంగా పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన చేశాము. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరాము. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు.  అంతేకాక 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనికదాడుల్ని మరింత  తీవ్రతరం చేసింది. ఫలితంగా మే 21న మాడ్‌లోని గుండెకోట్‌ సమీపంలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధానకార్యదర్శి బస్వరాజ్‌తోపాటు 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించింది. బస్వరాజ్ ఆలోచనల మేరకు శాంతి చర్చలను కొనసాగించాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్‌ పేర్కొన్నారు.

Abhay's latest photo

Abhay's latest photo

భారతదేశప్రధాని మోదీ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధానస్రవంతిలో చేరాలని చేసిన అభ్యర్థనల మేరకు మేం ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఈఅంశంపై కేంద్రహోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మా మారిన అభిప్రాయం గురించి  మా పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతిచర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని లేఖలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో పాటు, జైళ్లలో ఉన్న మా మిత్రులతో సంప్రదించడానికి మాకు నెలరోజుల  సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియోకాల్‌ ద్వారా మా అభిప్రాయాలను పంచుకోవడానికీ మేం సిద్ధంగా ఉన్నాము. అందువల్ల నెలరోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించండి. గాలింపుచర్యలను నిలిపివేయడం ద్వారా శాంతిప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుంది’’ అని అభయ్‌ తన లేఖలో  వివరించారు.

అయితే మావోయిస్టు పార్టీ గతంలో ఇలాంటి ప్రకటన చేయకపోవడం ఈ లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నాయని సమాచారం.  ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరిస్తే.. ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకోవడానికి nampet(2025)@gmail.com, ఫేస్‌బుక్ ఐడీ nampetalk ద్వారా అందుబాటులో ఉంటామని మావోయిస్టులు ప్రకటించడం గమనార్హం.

సోషల్‌ మీడియాలో చర్చ..

ఇక మావోయిస్టు పార్టీ(Maoist Party) సంచలన ప్రకటనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.  నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు మావోయిస్టులు  లేఖ రాసినట్లు బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్(Maoist Leader Abhay) పేరిట అమిత్ షాకు లేఖ వచ్చిందని వారు వెల్లడించడం విశేషం. ఆయుధాలు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు ల లేఖ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.

Also Read: ఓరి కామాంధుల్లారా.. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది యువకులు రేప్.. తల్లి చూడటంతో..!

Advertisment
తాజా కథనాలు