సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్.. వైసీపీతో పెట్టుకుంటే మాములుగా ఉండదుగా..

లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం #బాయ్‌కాట్‌లైలా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. వైసీపీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అంటున్నారు.

New Update
Boycott laila

Boycott laila Photograph: (Boycott laila)

యంగ్ హీరో విశ్వక్ సేన్ లైలా చిత్రంతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించాడు. డబుల్ మీనింగ్ కామెడీతో సినిమా ట్రైలర్‌తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం అనగా నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

బాయ్ కాట్ లైలా అంటూ..

నిల్ రావిపూడి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో పృథ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో వైసీపీ నేతలతో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే #బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో ట్విట్‌లు చేస్తున్నారు. దాదాపుగా 25 వేల ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

ఇదిలా ఉండగా ఈ విషయంపై హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. లైలా చిత్ర నిర్మాత సాహూ గారపాటి, విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ నిర్వహించి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. స్టేజ్‌పై పృథ్వీ మాట్లాడినప్పుడు అక్కడ లేమని,  చిరంజీవి వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్లామని తెలిపారు. అక్కడ ఉంటే తప్పకుండా మైక్ తీసుకునే వారమని విశ్వక్ సేన్ తెలిపాడు. ఒకరు చేసిన తప్పుకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు మాకు ఎలాంటి సంబంధం లేని తెలిపారు. మా సినిమాను చంపేయ వద్దని విశ్వక్ సేన్ అభిమానులను కోరాడు. 

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

ఇదిలా ఉండగా.. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే.. మొత్తం 150 మేకలు ఉన్నాయని.. ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇది చూసి విశ్వక్ అండ్ మూవీ టీం దీనిపై స్పందించింది.

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

Advertisment
Advertisment