ROBINHOOD: వెంకీ కుడుముల దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటించగా… నట కిరీటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో పోషించారు.
ఏజెంట్ జాన్ స్నో పాత్రలో రాజేంద్రప్రసాద్
అయితే తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటకిరీటీ రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్ షేర్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నో అకా జనార్ధన్ సున్నిపెంట అనే పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. గ్లింప్స్ లో డబ్బు గురించి నితిన్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో నితిన్ దొంగగా సరి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు.
Team #Robinhood wishes the ‘Nata Kireeti’ #RajendraPrasad Garu a very Happy Birthday ❤️🔥
Everyone’s favourite #RajendraPrasad Garu will report and spread laughter on the big screens as Agent John Snow aka Janardhan Sunnipenta 😎
In cinemas from December 20th, 2024.… pic.twitter.com/7NKw1LRabO
— Mythri Movie Makers (@MythriOfficial) July 19, 2024