Robinhood: పవన్ కు పోటీగా వస్తున్న నితిన్.. 'రాబిన్ హుడ్' నయా రిలీజ్ డేట్ ఇదే!

నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. గత ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడగా.. తాజగా మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు .

New Update
nithin robibhood

nithin robibhood

టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ నితిన్ (Nithin) హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్' (Robinhood). 'భీష్మ' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో 'రాబిన్ హుడ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 28న రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

నిజానికి ఈ మూవీ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు మార్చ్ 28 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇదే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. 

పవన్ కళ్యాణ్‌ను ఎంతో ఆదర్శంగా చూసే నితిన్, ఆయన్ను ఎంతో గౌరవిస్తాడు. పవన్ కు వీరాభిమాని. అలాంటి నితిన్ ఇప్పుడు పవన్ తో పోటీపడేందుకు రెడీ అవ్వడం గమనార్హం. ఈ రెండు సినిమాలు ఒకే రోజున వ‌స్తాయా? లేక ప‌వ‌న్ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉండ‌డంతోనే నితిన్ త‌న సినిమాని ఈ తేదీకి రిలీజ్ చేస్తున్నాడా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Also Read:  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

Also Read :  సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

publive-image

Advertisment
తాజా కథనాలు