Robinhood: ఓర్నీ ఇలా కూడా చేస్తారా..? ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను నితిన్ ఎలా చెప్పాడో చూశారా?

నితిన్-వెంకీ కుడుముల కాంబో ‘రాబిన్‌హుడ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 28న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మార్చి 21న సాయంత్రం 4.05గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

New Update
nithiin and venky kudumula robinhood movie trailer

nithiin and venky kudumula robinhood movie trailer

నితిన్ ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే  తనకు గతంలో భీష్మ మూవీతో హిట్ అందించిన దర్శకుడు వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు భలే రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ‘రాబిన్ హుడ్’ ఈ నెల అంటే మార్చి 28న గ్రాండ్ లెవెల్ల రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైయ్యారు. అయితే ఈసారి ట్రైలర్ అప్డేట్ అందించేందుకు హీరో నితిన్ అండ్ దర్శకుడు వెంకీ కుడుముల ఒక వినూత్న ప్రచారానికి తెరలేపారు. 

Also Read :అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

వినూత్నంగా ట్రైలర్ డేట్

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. అందులో నితిన్, వెంకీ కుడుముల కాన్వర్జేషన్ చాలా కొత్తగా ఉంది. ఇది ఒకరంగా ప్రమోషన్ల కోసం.. మరో రకంగా ట్రైలర్ లాంచ్ డేట్ రివీల్ కోసం బాగా ఉపయోగపడినట్లైంది. మొత్తంగా వీరిద్దరి కాన్వర్జేషన్‌తో వీడియో అదిరిపోయింది. ఇక ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 21న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 

Also Read:కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ఈ మూవీలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. బ్యాటింగ్ నుంచి షూటింగ్ వరకు!!! క్రికెట్ ఫీల్డ్ నుంచి సినిమా ఫీల్డ్ వరకు.. వెల్కమ్ బ్రదర్ అంటూ వార్నర్ పోస్టర్ షేర్ చేశారు. పోస్టర్ లో వార్నర్ స్టైలిష్ గా కనిపించారు. వార్నర్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అతని భారీ ఫాలోయింగ్ కారణంగా సినిమాపై, అలాగే బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా మంచి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.  

Also Read :విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

Advertisment
తాజా కథనాలు