Adhi Dha Surprisu Trolls: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

సోషల్ మీడియాలో "అదిదా సర్‌ప్రైజ్" సాంగ్ రీల్స్ ఫుల్ వైరల్ గా మారాయి. కేతిక ఒంటిపై మల్లెపూలతో చేసిన డాన్స్ స్టెప్ ను రీక్రియేట్ చేస్తూ  కొంత మంది అమ్మాయిలు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ రీల్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. 

New Update
Adhi Dha Surprisu Trolls

Adhi Dha Surprisu Trolls

Adhi Dha Surprisu Trolls: దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) డైరెక్షన్ లో నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం "రాబిన్‌హుడ్"(Robinhood). ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఉగాది కానుకగా విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో కేతిక శర్మ ఐటమ్ సాంగ్ తో సందడి చేయనుంది. 

Also Read:ఇది రియలైజేషన్ అంటే..! తప్పు ఒప్పుకున్న అనన్య నాగళ్ల

భారత స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల మూవీ టీమ్ విడుదల చేసారు. డేవిడ్ వార్నర్ ఎంట్రీ తో  "రాబిన్‌హుడ్" పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా  "అదిదా సర్‌ప్రైజ్" పాట సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ గా మారింది. ఈ పాటలో కేతిక డాన్స్ స్టెప్స్‌తో అందాలు ఆరబోసింది. 

Also Read:రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!

ఏంటి ఈ దరిద్రం..!

ఇప్పుడు సోషల్ మీడియాలో "అదిదా సర్‌ప్రైజ్" సాంగ్ రీల్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ముఖ్యంగా, కేతిక(Ketika Sharma) ఒంటిపై మల్లెపూలతో చేసిన డాన్స్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ  కొంత మంది అమ్మాయిలు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని వీడియోలపై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు, "ఏంటి ఈ దరిద్రం", "ఏంటి ఈ చెండాలం" అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి పిచ్చి డాన్సులు వేయడానికి సిగ్గులేదు అంటూ తిట్టి పోస్తున్నారు, ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ని అయితే ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. డబ్బుల కోసం ఇంత దిగ్గజారుతారా అంటూ విమరిస్తున్నారు. అయితే రాబిన్‌హుడ్మూవీకి మాత్రం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని చెప్పాలి. ఉగాది కానుకగా 28 మార్చ్  2025న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read:నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

Advertisment
తాజా కథనాలు