Sreeleela: అందులో వల్గారిటీ ఏం లేదు..! 'అది దా సర్‌ప్రైజ్‌' సాంగ్ పై శ్రీలీల కామెంట్స్..

రాబిన్ హుడ్ మూవీలో 'అది దా సర్‌ప్రైజ్‌' అంటూ కేతిక వేసిన డాన్స్ స్టెప్పులపై వస్తున్న విమర్శలకు శ్రీలీల స్పందిస్తూ.. "మాకు కంఫర్ట్ గా ఉన్నంతవరకు ఎలాంటి తప్పు లేనట్టే. ఆ డాన్స్ స్టెప్స్ మాకు కంఫర్ట్ గానే అనిపించాయి." అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

New Update
Sreeleela

Sreeleela

Sreeleela: హీరో నితిన్(Nithiin), శ్రీలీల కంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్’(Robinhood) మూవీపై మొదట్లో అంతగా బజ్ లేదు. కానీ ఒక్కపాటతో జనాల్లో సినిమాపై అట్టెన్షన్ క్రియేట్ అయ్యింది. సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసిన పాట   ‘అది దా సర్‌ప్రైజ్‌’. అప్పుడెప్పుడో విజయ్ తలపతి 'వారసుడు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వైరల్ స్పీచ్ లోని 'అది దా సర్‌ప్రైజ్‌' అనే పదం ఆధారంగా  ఈ పాటను రూపొందించారు.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఈ స్పెషల్ సాంగ్ లో కేతిక శర్మ నితిన్ తో కలిసి చిందులేసింది, అయితే ఈ పాటలో కేతిక డాన్స్ స్టెప్పులపై చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది, ఈ పాట కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. మహిళా కమిషన్ కూడా ఈ పాటలోని డాన్స్ మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసారు.

ఈ విషయం పై దర్శకుడు వెంకీ స్పందిస్తూ, "పాటను చిత్రీకరించేప్పుడు మాకు అందులో అశ్లీలత కనిపించలేదు. ఎంతో ప్రత్యేకంగా ఆ పాటను  డిజైన్ చేశాం. నిజంగా అది అశ్లీలంగా అనిపిస్తే, అసలు దాన్ని చిత్రికరించే వాళ్ళమే కాదు" అని చెప్పుకొచ్చారు.

Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

స్టెప్స్ మాకు కంఫర్ట్ గానే అనిపించాయి: శ్రీలీల

అయితే తాజాగా, ఈ పాటపై శ్రీలీల కూడా స్పందించింది. "నేనూ ఐటెం సాంగ్స్ చేసాను. మాకు కంఫర్ట్ గా ఉన్నంతవరకు ఎలాంటి తప్పు లేనట్టే, ఆ డాన్స్ స్టెప్స్ మాకు కంఫర్ట్ గానే అనిపించాయి. అందులో ఎలాంటి సమస్య లేదు. ఇది ఆమె(కేతిక) స్వేచ్ఛ" అని చెప్తూ, "మహిళా కమిషన్ చర్యలపై నేను మాట్లాడలేను, వారు సమాజానికి ఏది మంచిదో నిర్ణయించగలరు. ఒక నటిగా నా అభిప్రాయం మాత్రం, నాకు ఇబ్బంది లేనంతవరకు ఎలాంటి సాంగ్స్ అయినా చేస్తాను" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read: Modi-Trump: టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్‌ ఎఫెక్టేనా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు