Robinhood Trailer:  రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!

హీరో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈసినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్న విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ నుంచి దిగుతూ.. వార్నర్ ఎంట్రీ సూపర్‌గా ఉంది.

New Update

హీరో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. అతని చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

వార్నర్ ఎంట్రీ సూపర్‌గా ఉందని..

సినిమాలో నితిన్ ఎంట్రీ, కామెడీతో పాటు డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. హెలికాప్టర్‌ నుంచి దిగుతూ.. లాలీపాప్ తింటూ వార్నర్ వాకింగ్ స్టైల్ సూపర్‌గా ఉంది. పక్కా సినిమా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కామెడీతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్న్ పాత్ర ఏంటనే విషయంపై క్లారిటీ లేదు. 

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు