Adhi Dha Surprisu: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్‌’ లోని ‘అదిదా సర్‌ప్రైజ్‌’ స్పెషల్ సాంగ్ లో కేతిక వేసిన స్టెప్పులను అటు ఇటుగా మర్చి థియేటర్లలో చూపించారు అలాగే ఇప్పుడు అదే వెర్షన్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. ఈ ఫుల్ వీడియో సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

New Update
Ketika Sharma Item Song

Ketika Sharma Item Song

Adhi Dha Surprisu: నితిన్ శ్రీలీల జంటగా వచ్చిన ‘రాబిన్‌హుడ్‌’(Robinhood) మార్చి 28న థియేటర్లలో రిలీజై అడ్డంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే అనేక వివాదాలలో ఇరుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీలోని   ‘అదిదా సర్‌ప్రైజ్‌’ సాంగ్ పై చాల విమర్శలు వచ్చాయి. ట్రోల్స్, మిమ్స్ తో ఫుల్ వైరల్ అయ్యింది ఈ పాట.

Also Read: Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!

అలాగే ఆ పాటలోని ఆ ఒక్క స్టెప్పు  కారణంగా ‘రాబిన్‌హుడ్‌’ మూవీ కాంట్రవర్సీల్లో చిక్కుకుంది. అయితే ‘అదిదా సర్‌ప్రైజ్‌’ అంటూ కేతిక(Ketika Sharma) వేసిన స్టెప్పుల కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు షాకయ్యారు. ఏకంగా ఆ స్టెప్పును పాటలో నుండి లేపేశారు.

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్

అయితే రీసెంట్ గా సోమవారం ఏప్రిల్ 7వ తేదీన ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు మూవీ టీమ్. అయితే యూట్యూబ్ లో కూడా ఆ స్టెప్ లేకపోవడం విశేషం. నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయిన ఆ స్టెప్ ను సినిమాలోని  ఫుల్ వీడియో సాంగ్ లో లేకుండా చేయడంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

అయితే నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్‌’ లోని ఈ స్పెషల్ సాంగ్(Ketika Sharma Item Song) లో కేతిక వేసిన స్టెప్పులను అటు ఇటుగా మర్చి థియేటర్లలో చూపించారు అలాగే ఇప్పుడు అదే వెర్షన్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

Also Read: Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు