Vinesh Phogat: ఏడాది క్రితం ఆమెను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళారు. పోలీసులతో దెబ్బలు పడింది. న్యాయం కోసం రోడ్ల మీద ధర్నా చేసింది. అరెస్ట్ అయింది. వేధింపులకు గురైంది. దీంతో కెరీర్ ఖతం అయిపోయిందనుకున్నారు. విద్వేషకారులు విషం చిమ్ముతున్నా తన పోరాటం ఆపలేదు. వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూనే.. తన పంచ్‌లకు పదును పెట్టుకుంది. తప్పు చేసిన వారి తలలు దించుకునేలా పట్టుదలతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకుంది వినేశ్ ఫోగట్.
పోరాటంలో..
మహిళా రెజర్ల మీద లైగింకవేధింపులు ఆరోపణలతో ఒకప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మీద వినేశ్ ఫోగట్ అలుపెరుగని పోరాటం చేసింది. ఆ సమయంలో ఆమెకు చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా వెనక్కు తిరిగి ఇచ్చేసింది. సాధించిన పతకాలన్నీ గంగానదిలో విసిరేస్తానని చెప్పింది. అయినా రెజర్లకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు వినేశ్ కెరీర్ ఖతం అయిపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. అన్యాయం చేసినవాళ్ళు కాలరెగరేసుకుని దర్జాగా తిరుగుతుంటే ఆవేశంతో రగలిపోయింది. తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో.. జూనియర్ చేతిలో ఓడితే ఇక నీ ఆట ఖతం అంటూ అవహేళన చేశారు. కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ తనలోనే ఆవేశాన్ని మాత్రం చంపుకోలేదు.
పారిస్ ఒలింపిక్స్..
అసలు ఇప్పటివరకు మూడుసార్లు ఏ రెజ్లర్ ఒలింపిక్స్‌కు ఎంపిక కాలేదు. మొట్టమొదటిసారి వినేశ్ ఆ ఘనత సాధించిన మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్ మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇదే ఆమెకు బాగా అనుకూలంగా మారింది. దాంతో మొదటి నుంచి అన్ని పోరాటాల్లోనూ విజయం సాధించుకుంటూ వచ్చింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్ వరకు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ప్రీ క్వార్టర్స్‌లో మాత్రం ఆమెకు గట్టి పోటీనే ఎదురైంది. జపాన్ రెజ్లర్, వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత యీ సుసాకీ రూపంలో. ఈ పోరాటంలో వినేశ్ 3–2త సుసాకీని ఓడించింది. ఆ తర్వాత మరీ గట్టి పోటీ ఎదురైంది. ఉక్రెయిన్‌కు చెందిన, ప్రపంచ నంబర్ వన ఒక్సానా లివాచ్‌తో వరల్డ్ నంబర్ 65 వినేశ్ ఫొగట్ తలపడింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో లివాచ్‌ను7–5 తేడాతో వినేశ్ లివాచ్ పని పట్టింది. ప్రపంచ నంబర్ వన్ను మట్టి కరిపించి మరీ సెమీస్‌కు అర్హత సాధించింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్రకెక్కింది.
ఇప్పుడు ఈరోజ జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలో క్యూబా క్రీడాకారిణి గజ్‌మ్యాన్ లోపేజ్ మీద 5–0 తేడాతో వినేశ్ విజయం సాధించింది. దీని ద్వారా మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన క్రీడాకారిణిగా వినేశ్ చరిత్ర సృష్టించింది. బుధవారం ఫైనల్ జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో కూడా ఇదే తొలి పతకం కానుంది.
ప్రశంసల వర్షం…
వినేశ్ ఫోగట్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వినేశ్‌ను కొనియాడారు. ఆమె పోరాటం అద్బుతం అంటూ పొగిడారు. అసాధారణ విజయం. వరల్డ్‌నంబర్ వన్ సుసాకీని వినేశ్ ఓడించడం నమ్మశక్యంకాని విషయం. ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతుంది. ఎన్నో కష్టాలు చవిచూసింది. తను పతకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ నీరజ్ చోప్రా వినేశ్ ఆట తీరును ఆకాశానికెత్తాడు.
— Vinesh Phogat (@Phogat_Vinesh) March 12, 2024
Also Read: Paris Olympics: సెమీస్‌లో ఓడిన భారత్..ఇక కాంస్యం కోసం పోరు