/rtv/media/media_files/2025/03/08/GwPDM0jcOOA2IFdAa5xY.jpg)
India vs New Zealand Finals
ఛాంపియన్స్ ట్రోపీలో రెండు బలమైన టీమ్ లు ఫైనల్స్ కు వచ్చాయి. రెండూ కూడా ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చాయి. రెండు జట్లూ టైటిల్ కొట్టగల సత్తా ఉన్నవే. అయితే ఇండియా, న్యూజిలాండ్ టీమ్స్ లలో బ్యాటర్లు బలంగా ఉన్నారు. కానీ దుబాయ్ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి వారే ఫైనల్ మ్యాచ్ లో నిర్ణయాత్మ పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళు సృష్టించే జాదూతో బ్యాటర్లకు పెను సవాళ్ళే ఎదురవనున్నాయి అని చెబుతున్నారు.
తడాఖా చూపిస్తున్న స్పిన్నర్లు..
ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి నుంచీ స్పిన్నర్లే ప్రము పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇటు దుబాయ్, అటు పాకిస్తాన్ రెండు చోట్లా పిచ్ లు స్పిన్ కు అనుకూలించేవే. టీమ్ ఇండియా ఏ మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరడానికి కూడా కారణం స్పిన్నర్లే. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్ లేకున్నా.. జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్ దశలో, సెమీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్ దళం సెమీస్ లో కూడా కాపాడింది. ఇప్పుడు ఫైనల్స్ కూడా వారి చేతిలోనే ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్‌లతో టీమ్‌ఇండియా స్పిన్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కులదీప్ కాకుండా మిగతా బౌలర్లు అందరూ ఓవర్ కు అయుదులోపై పరుగులు ఇస్తున్నారు. వరుణ చక్రవర్తి అయితే ఏకంగా ఒక మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. అక్షర్, జడేజాలు కూడా మంచి ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చారు. ఏమాత్రం స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు.
కీవీస్ ఏమీ తక్కువ తినలేదు..
అయితే స్పిన్ విషయంలో న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. స్పిన్ విషయంలో భారత జట్టుకు సరి సమానంగా తూగుతుంది. శాంట్నర్ నేతృత్వంలో బ్రాస్‌వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ లు మంచి స్పిన్ ప్రత్యామ్నాయాలు ఆ జట్టుకున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బౌలింగ్‌లో స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయడం, అదే సమయంలో బ్యాటింగ్‌లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. శాంట్నర్ బంతిని విపరీతంగా తిప్పకపోయినా భిన్న కోణాలతో బ్యాటర్లకు సమస్యలు సృష్టించగలడు. గత కొన్నేళ్లలో భారత బ్యాటర్లు ఎడమచేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డ నేపథ్యంలో రచిన్‌తో కలిసి శాంట్నర్ ఫైనల్లో పెద్ద సవాలే విసరనున్నాడు. పైగా రీసెంట్ గా జరిగిన టెస్ట్ సీరీస్ లో వీవీస్ ఇండియాను 3-0తో క్లీస్ స్వీప్ చేసింది.