Champions Trophy: ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా?

లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 

New Update
cricket

Champions Trophy Finals

మరో ఐసీసీ ట్రోఫీ ముంగిట భారత జట్టు నిలిచింది. ప్రపంచ విజేతలు అవడానికి ఒక అడుగు ముందర ఉంది. మరొక్క అడుగు సమర్ధవంతంగా పడితే చాలు...తిరుగులేని జట్టుగా టీమ్ ఇండియా నిలుస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ను ఢీకొనబోతోంది. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ కు వచ్చింది టీమ్ ఇండియా ఒక్కటే.  ప్రస్తుతం ఫైనల్స్ లో భారత్ తో తలపడుతున్న న్యూజిలాండ్ ను కూడా గ్రూప్ దశలో ఓడించింది. దీంతో రోహిత్ సేనపై భారీ అంచనాలే ఉన్నాయి. 

టీమ్ ఇండియా జట్టు మంచి ఫామ్ లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు చాలా మంచి ఆట కనబరుస్తూ వస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు అందరూ చక్కటి ఫామ్ లో ఉన్నారు. ఇదే నిలకడను ఫైనల్లో కూడా కనబరిస్తే కచ్చితంగా విజయం మనదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కనుక గెలిస్తే భారత్ ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి చేరుతుంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. చివరగా 2013లో ఈ టైటిల్‌ సాధించింది. కివీస్‌ 2000లో భారత్‌ను ఓడించే ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది.

స్పిన్నర్లదే ఆట అంతా..

దుబాయ్ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.  కాబట్టి వారే ఫైనల్ మ్యాచ్ లో నిర్ణయాత్మ పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళు సృష్టించే జాదూతో బ్యాటర్లకు పెను సవాళ్ళే ఎదురవనున్నాయి అని చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి నుంచీ స్పిన్నర్లే ప్రము పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇటు దుబాయ్, అటు పాకిస్తాన్ రెండు చోట్లా పిచ్ లు స్పిన్ కు అనుకూలించేవే. టీమ్ ఇండియా  ఏ మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కు చేరడానికి కూడా కారణం స్పిన్నర్లే. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్‌ లేకున్నా.. జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్‌ దశలో, సెమీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్‌ దళం సెమీస్ లో కూడా కాపాడింది. ఇప్పుడు ఫైనల్స్ కూడా వారి చేతిలోనే ఉంది.

అన్ని విధాలుగా భారత్ కు అనుకూలం..

అన్ని విధాలుగా అదిరే ఫామ్ లో ఉన్న టీమ్ ఇండియాకు ట్రోఫీని గెలిచే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. నిజానికి 12 ఏళ్ళ విరామం తర్వాత ఈ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత్‌కు ఇదో చక్కని అవకాశం. అయితే న్యూజిలాండ్‌ కూడా అంతే బలంగా ఉంది. ఆ జట్టును ఓడించాలంటే శ్రమించాల్సిందే. దుబాయ్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన టీమ్ ఇండియాకు అనుకూలం అన్నమాట నిజమైనా..న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక ఇదే టోర్నీలో కీవీస్ కూడా దుబాయ్ లో ఇదే భారత్ తో ఆడింది. అందువల్ల ఆ టీమ్ కు కూడా ఇక్కడ ఉన్న పిచ్ లు, పరిస్థితులు అన్నింటినీ పూర్తిగా తెలుసుకుంది. కాబట్టి రెండు టీమ్ లకూ విన్నింగ్ అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ టీమ్ ఇండియా బ్యాటర్లు, బౌలర్లూ అందరూ సమిష్టిగా రాణిస్తూ న్యూజిలాండ్ పై కప్పు గెలవచ్చు. 

Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు