PBKS VS MI: పంజాబ్ ను గెలిపించిన శ్రేయస్..ఫైనల్ కు కింగ్స్

పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ మంగళవారం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది.

New Update
ipl

PBKS VS MI

పంజాబ్ నిజంగానే కింగ్స్ అనిపించుకుంది. మొదటి క్వాలిఫయర్ లో ఘోరంగా ఓడిపోయిన ఈ టీమ్ రెండో క్వాలిఫయర్ లో కమ్ బ్యాక్ ఇచ్చింది. టోర్నీ మొదట నుంచి దుమ్ము లేపుతున్న తమ సత్తాను మరోసారి చూపించింది. అహ్మదాబాద్ లో జరిగిన రెండో క్వాలిఫయర్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా..ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎమ్ఐ 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. బెయిర్ స్టో 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు, తిలక్ వర్మ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 44 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 44 పరుగులు చేశారు. నమన్ ధీర్ కడా 18 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసి రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో ఒమర్జాయ్‌ 2, జెమీసన్‌, స్టాయినిస్‌, చాహల్‌, వైశాక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

Also Read :  ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

మ్యాచ్ ను గెలిపించిన కెప్టెన్...

రెండో ఇన్నింగ్స్ లో బ్యటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాటర్లు మొదట నుంచి దూకుడుగా ఆడారు. ఎక్కడా మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోకుండా బ్యటింగ్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కెప్టెన్ శ్రేయస అయ్యార్ గురించి. సారథిగా మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో 207 పరుగులు చేసింది.శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో దంచి కొట్టాడు. నేహల్ వధేరా 29 బంతుల్లో 4 ఫర్లు, 2 సిక్స్ లతో 48, జోష ఇంగ్లిస్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్ల తో 38 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్య ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడతాయి. 2014 తర్వాత పంజాబ్ జట్టు ఫైనల్ కు చేరడం ఇదో మొదటిసారి. 

Also Read :  ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు

Also Read :  ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి

Also Read :  బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన

మంగళవారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ, పంజాబ్ లు ఐపీఎల్ మొదలైన నుంచి ఇప్పటి వరకు ఫైనల్ కు చాలా సార్లే చేరుకున్నాయి. కానీ టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయాయి.  దీంతో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరు గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ అవుతారు. ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే కూడా ఉంది.  

IPL 2025 | finals | match | today-latest-news-in-telugu | PBKS vs MI

Advertisment
తాజా కథనాలు