CM Chandra Babu: తెలుగు తమ్ముళ్ళకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రాంరభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 ఈ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దాంతో పాటూ రూ.లక్ష పైబడి చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం కల్పించాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్లు, సమన్వయ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్యం తీసుకున్నారు. ఇవే కాక పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో పాలనలోకి వచ్చి 100 రోజులు గడిచింది. ఈ వంద రోజుల్లో సాధించిన విజయాలు, చేపట్టాలని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ నేతలు మిత్రపక్షాల నాయకులతో సమన్వయంతో పని చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. అంతేకాదు పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన నేతలను గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రుల నియామకం చేపడతామని నేతలతో చెప్పారు.
Also Read: Andhra Pradesh: జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా?