/rtv/media/media_files/2025/04/26/cVp3RzUjMd1FUQeHIShE.jpg)
Matsyakara sevalo scheme
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
ఒక్కో కుటుంబానికి రూ.20,000
ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. https://t.co/6MiLJIsqp1
— Telugu Desam Party (@JaiTDP) April 26, 2025
దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార భరోసాను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు... నేడు ఆ భరోసాను రూ. 10వేల నుండి రూ.20 వేలకు పెంచిన ఘనత ఆయన సొంతం.#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/ov08fTDKIj
— Telugu Desam Party (@JaiTDP) April 26, 2025
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam