AP News:  సీఎం చంద్రబాబుతో పవన్ కీలక భేటీ.. అన్న పదవికోసమేనంటూ!

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులు, మోదీని ఆహ్వానించే అంశం గురించి డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
PAWANKALYAN

AP Deputy CM Pawan Kalyan meets CM Chandrababu

AP News:  సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన కలిసిన పవన్.. MLC నాగబాబు మంత్రి పదవిపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని పున:ప్రారంభ పనులు, ప్రధాని మోదీని ఆహ్వానించే అంశం గురించిన పలు కీలక అంశాలపై డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాగబాబుకు ఇచ్చే పోర్ట్ ఫోలియోపై చర్చించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు గురించి కూడా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. 

స్వర్ణాంధ్ర విజన్‌ -2047..

ఇక శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్‌ -2047 డాక్యుమెంట్‌పై లఘు చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీకి చేరాలని ఆకాంక్షించారు. అలాగే నియోజకవర్గ విజన్‌ డాక్యుమెంట్‌ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. దాని అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని, అప్పటికల్లా 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలన్నారు. వికసిత్‌ భారత్‌-2047ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని కొనియాడారు. 

Also Read :  సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?

ఇక పవన్ మాట్లాడుతూ.. వైసీసీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్లు గుర్తించామని చెప్పారు. మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. దానిపై విచారణ సాగుతోందని, ఉపాధిహామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని చెప్పారు. 

Also Read :  నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!

Advertisment
తాజా కథనాలు