/rtv/media/media_files/2025/05/04/NCe3tOJNVkHU21ez7epL.jpg)
CM Chandrababu Talliki Vandanam
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘తల్లికి వందనం’ పథకం పై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
ఒక్కొక్కరికి రూ.15,000
ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15,000 చెల్లించనున్నట్లు తెలిపారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ‘అమ్మఒడి’ పేరిట ఇచ్చిన పథకానికి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ అని పేరు మార్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ‘తల్లికి వందనం’ పథకాన్ని గత ఏడాది ప్రారంభించాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.
ఎట్టకేలకు ఈ నెలలో అంటే మేలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. టీడీపీ MPలు, MLAలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మహానాడుతో సహా రాజధాని అమరావతి నిర్మాణం, ప్రభుత్వ స్కీమ్స్, సంక్షేమ కార్యకలాపాలపై తమ పార్టీ నాయకులకు వివరించారు.
ఈ మేరకు కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో తల్లికి వందనం పథకం పై మాట్లాడారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తాం అని అన్నారు. అంతేకాకుండా పాఠశాలల ప్రారంభానికి ముందే ‘తల్లికి వందనం’ పథకం కింద చదువుకునే ఒక్కొక్క విద్యార్థికి రూ.15 వేలు అందిస్తాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
talliki-vandanam | talliki vandanam scheme | cm-chandra-babu