Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు!

జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎక్కువ శాతం ఓట్ల వచ్చిన వారికి ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ కేవలం జర్మనీలోనే ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చని సెటైర్లు వేశారు పవన్.

New Update
Pawan Kalyan On YS Jagan

Pawan Kalyan On YS Jagan

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా చంద్రబాబో లేక తానో ఇచ్చిది కాదని డిప్యూటీ సీఎం పవన్ సెటైర్లు వేశారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. వైసీపీకి 11 సీట్లు వస్తే జనసేనకు 21 వచ్చాయన్నారు. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని అన్నారు. ఓట్లు ఎక్కువ శాతం వస్తే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చన్నారు. గవర్నర్ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రోజు అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించారన్నారు. వైసీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు