Bahishkarana Trailer: నటి అంజలి (Anjali), అనన్య నాగళ్ల (Ananya), శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సీరీస్ ‘బహిష్కరణ’. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ లో పుష్ప అనే వేశ్య పాత్రలో అంజలి తన విశ్వరూపాన్ని చూపించేశారు. ఈ ట్రైలర్ ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
బహిష్కరణ ట్రైలర్
మంచోడు చేసే తప్పేంటో తెలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం అనే డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. జీవితంలో నిజమైన ప్రేమ, ఆనందాన్ని పొందాలనే అంజలి కోరిక తలకిందులవుతుంది. దాంతో ఆమె ప్రియుడి దారుణ హత్య పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉంటుంది అంజలి. మరో వైపు ఆ ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను చూపించారు. అసలు ఆ పల్లెటూరుకి అంజలి ఎందుకు ఎందుకు వచ్చింది.? అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది? అనేది ఈ వెబ్ సీరీస్ కథ. ట్రైలర్ లో ‘మంచోడు చేసే మొదటి తప్పేంటో తెలుసా’, ‘లోకంలో ప్రతి యుద్ధం స్వర్ధం తో మొదలవుతుంది’, ‘ప్రపంచమే అబద్దాల పునాదుల మీద నిలబడ్డది రా’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.