OTT Update: నవ్విస్తూనే భయం పుట్టించిన సినిమా సీక్వెల్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఇటీవల థియేటర్స్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈనెల 10వతేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలోకి వస్తుందని ఇండస్ట్రీ టాక్. By KVD Varma 06 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి OTT Update: ఓటీటీలో సినిమాలు వస్తూనే ఉంటాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు.. నేరుగా ఓటీటీలోనే వచ్చేసే సినిమాలు ప్రతివారం సందడి చేస్తూనే ఉంటాయి. థియేటర్ లో వచ్చి హిట్ అయిన సినిమాలు అప్పటికే చూసినా సరే.. ఓటీటీలో(OTT Update) రిలీజ్ అయితే, అక్కడ కూడా మళ్ళీ వదలకుండా చూసేస్తారు చాలామంది. ఓటీటీ లవర్స్ పెరిగిపోవడంతో ఓటీటీలో వచ్చే ప్రతి సినిమా గురించి ముందుగా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు నవ్విస్తూనే భయపెట్టే ఒక తెలుగు సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపొయింది. మరి ఆ సినిమా ఏమిటో.. ఎప్పుడు ఓటీటీ(OTT Update)కి వచ్చేస్తోందో.. ఏ ఓటీటీలో విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. OTT Update: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా రకాల హారర్ సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టాయి. మరి కొన్ని నవ్వించాయి. ఇంకొన్ని ఎమోషన్స్ తో కలగలిపి భయపెట్టాయి. భయపెట్టే సినిమాలు చూడటం కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. నిజానికి సినిమాలు చూసేవారిలో చాలామంది ఇలాంటి హర్రర్ సినిమాలను ఇష్టపడతారు కూడా. ఇక ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. థియేటర్లో రిలీజ్ అయ్యి.. అందర్నీ నవ్విస్తూనే భయపెట్టిన ఒక స్పెషల్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధం అయిపొయింది. అది 'గీతాంజలి మళ్లీవచ్చింది'. ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. అక్కడ చూసిన ప్రేక్షకులు మళ్లీ OTTలో(OTT Update) చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: విజయ్ ఆంటోనీ రోమియో ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? OTT Update: హారర్ కామెడీగా విడుదలై సందడి చేసిన 'గీతాంజలి మళ్ళీ పుట్టింది' సినిమాలో తెలుగు నటి అంజలి ప్రధాన పాత్ర పోషించింది. గతంలో ఆమె నటించిన 'గీతాంజలి'కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. గీతాంజలి ఈజ్ బ్యాక్, అంటూ క్రేజీ కాన్సెప్ట్‌తో సినిమాని తీసుకువచ్చారు. కోన వెంకట్- MVV సత్యనారాయణ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజ ప్రియ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. అంజలి నటించిన సూపర్ హిట్ సినిమా గీతాంజలికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా OTT స్ట్రీమింగ్ గురించి ఇంతకు ముందు.. చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హారర్ కథాంశంతో రూపొందిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT సంస్థ Amazon Prime Video సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లే ‘గీతాంజలి మళ్ళీవచ్చింది’ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మే 10న విడుదల కానుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ఈరోజో.. రేపో ప్రకటించవచ్చని సమాచారం. #anjali #geethanjali-malli-vachindi #ott-movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి