Anjali: బాలకృష్ణకు దండం.. అంజలి ట్వీట్ వైరల్.. మీరు అలా చేసినందుకు..!

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకి హీరోయిన్ అంజలి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని తన సమక్షంలో ఘనంగా నిర్వహించినందుకు థాంక్స్ చెప్పింది. ఆయనతో తనకు మంచి స్నేహం ఉందని ట్విట్ లో పేర్కొంది.

New Update
Anjali: బాలకృష్ణకు దండం.. అంజలి ట్వీట్ వైరల్.. మీరు అలా చేసినందుకు..!

Anjali: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజై మంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిదిగా హజరైయ్యారు. అయితే, ఇదే ఈవెంట్ లో హీరోయిన్ అంజలిని బాలయ్య నెట్టేశాడు. ఆ తర్వాత నవ్వుతూ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.

Also Read: సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు

బాలయ్య ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం ఫ్యాన్స్ కు తప్ప నార్మల్ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చ లేదు. గతంలో చాలా సార్లు బాలయ్య ఇలానే బిహేవ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయడంతో.. ‘బాలయ్య నువ్వు ఎప్పుడు మారతావయ్యా?’, ఏంటి బాలయ్య ఇది.. నువ్వు ఇక మారవా?’ అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు.

Also Read: సినీ ప్రేమికులకు పండగ రోజు.. మల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయలకే సినిమా! 

అయితే, హీరోయిన్ అంజలి మాత్రం సోషల్ మీడియా వేదికగా హీరో బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని తన సమక్షంలో ఘనంగా నిర్వహించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. బాలకృష్ణతో తనకు మంచి స్నేహం ఉందని.. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని ట్వీట్ లో పేర్కొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు