Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ చూస్తే గూస్ బంప్సే..

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇందులో చరణ్ లుక్ వేరే లెవెల్లో ఉంది. ‘‘బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకొకరు లేరు.. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు’’ అనే డైలాగ్ అదిరిపోయింది.

New Update
game changer,

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే విలక్షణ నటుడు సముద్రఖని, ఎస్ జే సూర్య సహా మరెంతో మంది నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

ఇక ఎప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే దశకు చేరుకుంటుంది. ఇందులో భాగంగానే వరుస అప్డేట్లు ఇస్తూ మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తుంది. ఇప్పటికే పోస్టర్లతో పిచ్చెక్కిన మూవీ టీం, గతంలో ఓ సాంగ్‌తో అంచనాలు పెంచేసింది. జరగండి జరగండి అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసింది. 

ఆ తర్వాత పలు అప్డేట్‌లు వదులుతూ అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఇక చాలా రోజుల తర్వాత సర్‌ప్రైజ్ అందించింది. ఈసారి చెప్పిన డేట్‌కి టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది. రామ్ చరణ్‌ లుక్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అలాగే కియారాతో చరణ్ రొమాన్స్, సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లోకేషన్స్ హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ టీజర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. 

ఇది కూడా చూడండి: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

ఫైట్ సీన్లు థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇక టీజర్ మొదట్లో.. ‘‘బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకొకరు లేరు.. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు’’ అనే డైలాగ్ అదిరిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. 

ఇది కూడా చూడండి: Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు