Ind Vs Pak: ఓర్నీ ఇదెక్కడి వెటకారం.. విరాట్ కోహ్లీ పేరుతో పాక్ జెర్సీలు.. వీడియో చూశారా!

దుబాయ్ వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ ప్రియులు విరాట్ కోహ్లీ పేరు, నంబర్‌తో పాకిస్థాన్ జెర్సీలలో కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

New Update
Virat Kohli name on Pakistan jerseys in india vs pakistan match

Virat Kohli name on Pakistan jerseys in india vs pakistan match

భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ ప్రియులు ఒక్కో విధంగా ప్రవర్తించారు. మ్యాచ్ ప్రారంభంలో ఒకలా, ముగింపు సమయంలో మరోలా కనిపించడంతో నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మ్యాచ్ మొదలైనపుడు పాకిస్థాన్ జెర్సీలతో కనిపించిన కొందరు.. భారత్ గెలిచే సమయానికి టీమిండియా జెర్సీలు ధరించడంతో అంతా షాక్ అయి షేక్ అయిపోయారు.

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

అందుకు సంబంధించిన వీడియోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ వీడియోలు చూసిన కొందరు.. ఓరేయ్ ఇలా తయారయ్యారేంట్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మరో వీడియో నెటిజన్లను, క్రికెట్ ప్రియులను బాగా నవ్వించింది. భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అయిపోయిన అనంతరం స్టేడియం నుంచి క్రికెట్ ప్రియులు బయటకు వచ్చేశారు. 

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

పాక్ జెర్సీపై విరాట్ పేరు

ఈ క్రమంలో ఓ వ్యక్తి పాకిస్థాన్ జెర్సీతో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. అదేంటి పాక్ జెర్సీతో కనిపిస్తే అందులో విచిత్రం ఏముంది అని అనుకుంటున్నారా?. అక్కడే అసలు మజా ఉంది. అది పాకిస్థాన్ జెర్సీనే అయినా.. దాని వెనుకున్న పేరు, జెర్సీ నెంబర్ మాత్రం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీది కావడం గమనార్హం. 

Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..

నమ్మడానికి కాస్త విచిత్రంగానూ, చూడటానికి కాస్త వింతగానూ అనిపిస్తున్నా? అందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తి పాకిస్థాన్ జెర్సీపై విరాట్ పేరు, అతడి జెర్సీ నంబర్‌తో కనిపించాడు. దీంతో ఆ వీడియోను విరాట్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. 

Also Read: IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం

Advertisment
Advertisment
తాజా కథనాలు