Sourav Ganguly: క్యాబ్  అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..మళ్ళీ ఆరేళ్ళ తర్వాత

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

New Update
icc

Sourav Ganguly

బెంగాల్ టైగర్...గంగూలీ...తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అందరూ దాదా అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ(sourav-ganguly)... టీమ్ ఇండియా(team-india) బయాటర్ గా చాలా  కాలం కొనసాగారు. కెప్టెన్ గా కూడా జట్టుకు బోలెడు విజయాలను అందించారు. క్రఇకెటర్ గా రిటైర్ అయిన తర్వాత గంగూలీ రకరకాల పదవులను చేశారు. కామెంటేటర్ గా, బీసీసీఐలో, అలాగే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ...ఇలా చాలా రకాలుగా కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు మళ్ళీ ఆరేళ్ళ తర్వాత దాదా క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సోమవారం జరిగిన 94వ వార్షిక సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు 2015-2019 మధ్య దాదా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.  

Also Read :  మళ్ళీ పాకిస్తాన్ కంప్లైంట్..ఈసారి టీవీ అంపైర్ పై

ఈడెన్ గార్డెన్ అభివృద్ధి...

ఇప్పుడు మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ...తాను పదవిలో ఉండగా కీలకమైన అభివృద్ధిని చేయాలని అనుకుంటున్నాడు. ఈడెన్ గార్డెన్ సామర్ధ్యాన్ని లక్షకు పెంచడం, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో ఇంపార్టెంట్ మ్యాచ్ లకు ఈడెన్ గార్డెన్స్ ను ఆతిధ్యమిచ్చేలా చేయడం ఇందులో ప్రధానమైనవి. ఈ మైదానంలో ఈ నవంబర్ 14 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈడెన్ లో ఆరేళ్ల తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.  ఈడెన్ లో  చివరగా 2019 నవంబర్ లో భారత్, బంగ్లా మధ్య పింక్ బాల్ (డే/నైట్) టెస్టు జరిగింది. అప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. 
 
 క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గంగూలీ మీడియాతో మాట్లాడాడు.  దీనిలో భారత్, సౌత్ ఆఫ్రికా ల టెస్ట్ గురించి చెప్పాడు. దీనికి మంచి ఏర్పాట్లను చేస్తానని..బీసీసీఐతో మాట్లాడతానని చెప్పాడు. ఇది కచ్చితంగా చాలా మంచి మ్యాచ్ అవుతుందని అన్నారు.

Also Read :  ఫైనల్‌లో మరోసారి భారత్‌ vs పాక్.. ఎలా అంటే?

Advertisment
తాజా కథనాలు