/rtv/media/media_files/2025/09/22/pak-1-2025-09-22-13-49-37.jpg)
ఆసియా కప్ 2025(Asia cup 2025) లో ప్రస్తుతం సూపర్ ఫోర్ పోరు జరుగుతోంది.తొలి మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka) పై బంగ్లాదేశ్(Bangladesh) గెలవగా.. పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. అయితే ఇంతటితో పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. భారత చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ, వారికి ఇంకా ఫైనల్ కు వెళ్లే దారి మిగిలే ఉంది. అయితే పాకిస్తాన్ కు ప్రతి మ్యాచ్ కీలకమే, తమ మిగిలిన రెండు మ్యాచ్ లలో తప్పనిసరిగా ఆ జట్టు గెలవాల్సిందే. వారు ఒక మ్యాచ్ ఓడినా ఫైనల్కు చేరే అవకాశం ఉండదు.
Also Read : మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం.. ట్వీట్లతో పాక్ పరువు తీసిన ఇండియన్ ఓపెనర్లు!
సెప్టెంబర్ 23న శ్రీలంకతో
సెప్టెంబర్ 23న పాక్ జట్టు శ్రీలంకతో ఆడనుంది. సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్ తో పోటీ పడనుంది. పాకిస్తాన్ అర్హత సాధించడానికి ఉన్న మూడు మార్గాలున్నాయి. పాకిస్తాన్ తమ మిగిలిన రెండు మ్యాచ్ లలో శ్రీలంక, బంగ్లాదేశ్ పై తప్పక గెలవాలి. అదే సమయంలో, శ్రీలంక తమ చివరి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోవాలి. అలా జరిగితే, పాకిస్తాన్ పాయింట్లతో ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ తమ రెండు మ్యాచ్ లలోనూ భారీ తేడాతో గెలవాలి. ఒకవేళ ఏ జట్టైనా పాయింట్లలో సమానంగా ఉన్నా, పాకిస్తాన్ మెరుగైన నెట్ రన్ రేట్ తో ఫైనల్ కు వెళ్లవచ్చు.
ఒకవేళ బంగ్లాదేశ్ భారత్ తో మ్యాచ్లో ఓడిపోయి, పాకిస్తాన్ తమ రెండు మ్యాచ్లలో గెలిస్తే, పాకిస్తాన్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో మూడుసార్లు భారత్ - పాకిస్థాన్ తలపడలేదు. రెండేసిమార్లు ఐదు ఎడిషన్లలో ఎదురుపడ్డాయి. ఒకవేళ ఇప్పుడు ఫైనల్‌కు చేరితే తొలిసారి ఒకే టోర్నీలో మూడుసార్లు తలపడినట్లు అవుతుంది. కాగా భారత జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది, ఆపై శుక్రవారం శ్రీలంకతో తలపడుతుంది.
Also Read : ఏరా ఇది మ్యాచ్ అనుకున్నావా.. యుద్ధం అనుకున్నావా.. ఫర్హాన్ పై ఫైర్ !